Header Banner

రెండు వేల కోట్లతో నీటి ప్రాజెక్టులకు నిధుల జలపాతం! మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన!

  Mon Mar 10, 2025 18:29        Politics

పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ ఏడాది జూన్ నెల నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మట్లాడారు. ఏడు వందల కిలోమీటర్ల ప్రవహించి రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 99 పనుల కోసం రూ. 37.63 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


పాలకొల్లు పట్టణంలో పది వార్డుల ఏరియాను ముంచెత్తుతున్న దమయ్యపర్తి కోడు ప్రక్షాళనకు రూ. 14 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 8 కోట్ల వ్యయంతో యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ మురుగు కాలువల ప్రక్షాళనకు రూ. 16 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాజ, మాదవయ్యపాలెం స్లూయిస్ మరమ్మతులకు రూ. 9 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు చేశామని అన్నారు.చింతలపూడి ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #polavaram #water #projects #todaynews #flashnews #latestnews